Deputy Cm పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్ర తీరం కోతకు శాశ్వత పరిష్కారం

Deputy Cm పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్ర తీరం కోతకు శాశ్వత పరిష్కారం
Deputy Cm పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్ర తీరం కోతకు శాశ్వత పరిష్కారం : పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే కార్యచరణకు దిగారు. నేడు వాకతిప్ప షిప్పింగ్ హార్బర్ ను, సూరప్ప తాగునీటి చెరువును పవన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ కు ఉప్పాడ గ్రామ ప్రజలు, తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆత్మీయస్వాగతం పలికారు.

Deputy Cm పవన్ కళ్యాణ్

Deputy Cm పవన్ కళ్యాణ్ కు ఉప్పాడలో ఘన స్వాగతం మత్స్యకార మహిళలు పూల వర్షం కురిపించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులతో కలసి అధ్యయనానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ మారీ టైమ్ బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వ శాఖ(ఎర్త్ సైన్స్ మినిస్ట్రి) అధికారులు, రెవెన్యూ అధికారులతో దీనిపై చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు.

ఉప్పాడ సముద్రం కోతపై శాశ్వత పరిష్కారం కావాలన్న Deputy Cm పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది? దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడదామని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు..

Deputy Cm పవన్ కళ్యాణ్

8 తీర ప్రాంత గ్రామాల్లో 1360 ఎకరాలు కోతకు గురైందన్న అధికారులు ఉప్పాడ గ్రామ తీర ప్రాంతంలో మొత్తం 84 ఎకరాల విస్తీర్ణంతో భూమి సముద్రంలో కలిసిపోయిందని జిల్లా సర్వేయర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. 60 ఎకరాలు కోతకు గురయ్యాక సర్వే ప్రారంభించినట్టు, సర్వే ప్రారంభించిన తర్వాత మరో 20 ఎకరాలు సముద్రంలోకి వెళ్లిపోయిన విషయాన్ని వివరించారు. మొత్తం యు.కొత్తపల్లి మండల పరిధిలోని 8 తీర ప్రాంత గ్రామాల్లో 1360ఎకరాలు కోతకు గురైన విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top