నేడు Kakinada లో నిన్న తిరువూరులో కూల్చివేతలు : అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అక్రమాలకు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ఆనాడు ప్రతిపక్షపార్టీల నేతలు ధ్వజమెత్తినా, బాధితు లకు ఆక్రోశించినా పట్టించుకున్నవారే లేరు. పైగా అవేమీ తనకు సంబంధం లేదన్నట్టుగా ఈ మాజీ ఎమ్మెల్యే అప్పట్లో తన నోటికి పనిచెప్పి ఎంతోమందిని దుర్భాషలతో దూషించేవారు. ఆఖరికి మీడియాను సైతం బెదిరించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు.
పదవిపోయిందనే, ప్రజలు తిరస్కరించారనే స్పృహ చంద్రశేఖర్‌రెడ్డికి ఇప్పటికీ కలగలేదు. తానింకా అధికారంలో ఉన్నట్టుగానే అటు ప్రజలపైనా, ఇటు అధికారులపైనా వీరంగం చేస్తున్నారు. అలాంటి సంఘటన కాకినాడలో గొడారిగుంట ప్రాంతంలో మంగళవారం జరిగింది. స్థానిక రాజ్యలక్ష్మినగర్‌లో వైసీపీ కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు ఒకరు అక్రమంగా ఒక భవంతుని నిర్మించాడు. మొదటి ఫ్లోర్ వరకు అనుమతులు ఉండగా, అప్పట్లో అధికార అండతో అడ్డగోలుగా రెండో ఫ్లోర్ కూడా అధికారులను బెదిరించి నిర్మించేశారు.
నేడు Kakinada లో నిన్నతిరువూరులోకూల్చివేతలు
ఇది గమనించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు లేకుండా నిర్మించిన రెండో ఫ్లోర్‌ను కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. వారం రోజుల కిందటే ఈ నోటీసులు ఇచ్చినప్పటికీ సంబంధిత వైసీపీ కార్యకర్త, చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడు ఇసుమంతైనా స్పందించలేదు. కనీసం అధికారులకు జవాబు కూడా ఇవ్వలేదు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు మంగళవారం రంగంలోకి దిగి రెండో అంతస్తు కూల్చే ప్రయత్నం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అక్కడ ప్రత్యక్షమయ్యారు.
ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా అధికారులను బెదిరించారు. భవనం వద్ద ఉన్న దిగువస్థాయి అధికారులందరినీ వెళ్లిపొమ్మని హెచ్చరించారు. భవనం పైఅంతస్తు కూల్చే పని పర్యవేక్షిస్తున్న అధికారులను నిలువరించి తన అనుచరులతో వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా రెండో ఫ్లోర్‌కి చేరుకుని అప్పటికే భవనాన్ని కూల్చడానికి కార్పొరేషన్ అధికారులు నియమించిన కూలీలపై మాజీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న ఇటుక రాళ్లు తీసి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు.
ఈ దాడిలో పలువురు కూలీలకు కూడా గాయాలయ్యాయి. తప్పని పరిస్థితుల్లో అక్కడున్న కూలీలందరూ పక్క భవనంపైకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతటితో ఆగకుండా కింద ఉన్న టౌన్‌ప్లానింగ్ అధికారులకు ద్వారంపూడి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇంతలో అక్కడున్న పోలీసులు ఎంత అడ్డుకుందామని ప్రయత్నించినా చంద్రశేఖర్‌రెడ్డి తన అనుచరులతో రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. దూర్భాషలతో అధికారులను దూషించారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ చంద్రశేఖర్‌రెడ్డి ఫోన్లో ప్రయత్నించారు.
నేడు Kakinada లో నిన్న తిరువూరులో కూల్చివేతలు
నిబంధన ప్రకారమే ఈ చర్యలకు దిగామని, అక్రమ నిర్మాణాలపై చర్యలను అడ్డుకోరాదంటూ ఉన్నతాధికారుల నుంచి సమాధానం రావడంతో చేసేదిలేక ద్వారంపూడి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా టౌన్ ప్లానింగ్ అధికారి డీసీపీ హరిదాస్ ‘ఆంరఽధజ్యోతి’తో మాట్లాడుతూ అక్రమ నిర్మాణం విషయంలో అంతా నిబంధన ప్రకారమే జరుగుతోందని స్పష్టంచేశారు.